దుర్గగుడిలో కొందరు ఉద్యోగులు పాతుకుపోయి చక్రం తిప్పుతున్నారు. దేవస్థానం గురించి క్షుణంగా తెలియడంతో ఇక్కడ నుంచి వేరే దేవాలయాలకు వెళ్లడానికి గానీ, కనీసం దుర్గగుడిలో ఇతర విభాగాలకు వెళ్లడానికి కూడా వీరు ఇష్టపడటం లేదు. తాము పనిచేసే విభాగంపై పట్టుబిగించి అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. దుర్గగుడికి ఈవోలు మారతారు గానీ.. వీరు మాత్రం మారనని దేవస్థానంలో ప్రచారం జరుగుతోంది. దుర్గగుడి అంతరాయలంలో సూపరింటెండెంట్‌గా ఒక ఉద్యోగి దీర్ఘకాలంగా ఉన్నారు. ఆయనకు అమ్మవారి ఆలయంలో తప్పా మరెక్కడా డ్యూటీలు వేయరు. మరో సూపరింటెండెంట్ లడ్డూ తయారీ విభాగంలో సీటు కదలడు. ఇంకో సూపరింటెండెంట్ పరిపాలన విభాగంలో సెటిల్ అయిపోయారు. కేవలం పురుషులే కాదు స్టోర్స్, అకౌంట్స్, అన్నదానంలో పనిచేసే మహిళా జూనియర్ అసిస్టెంట్‌లు నాలుగైదేళ్లయినా ఆయా విభాగాలను వదలడం లేదు.
కదలరు... వదలరు
విజయవాడ: దుర్గగుడిలో కొంతమంది ఉద్యోగస్తులు దీర్ఘకాలంగా పాతుకుపోయారు. దేవస్థానం గురించి క్షుణ్ణంగా తెలియడంతో ఇక్కడ నుంచి వేరే దేవాలయాలకు వెళ్లడానికి గానీ, కనీసం దుర్గగుడిలో ఇతర విభాగాలకు వెళ్లడానికి కూడా వీరు ఇష్టపడటం లేదు. తాము పనిచేసే విభాగంపై పట్టుబిగించి అందినకాడికి దండుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. దుర్గగుడికి ఈవోలు మారతారు గానీ, వీరు మాత్రం మారనని దేవస్థానంలో ప్రచారం జరుగుతోంది.